హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతన్నలకు సేవలు చేరువ చేయాలి: కలెక్టర్

MBNR: రైతులకు మెరుగైన సేవలు అందించాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. DCCB కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో బ్యాంకు కార్యకలాపాలు, పరిపాలనా తీరును ఆమె పరిశీలించారు. అందరూ సమన్వయంతో పనిచేసి రైతన్నలకు సేవలను మరింత చేరువ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిప్రియ, డీసీవో కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.