హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడలతో మానసిక ఉల్లాసం: సీఐ

HNK: యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సీఐ పులిగిల్ల నవీన్ సూచించారు. కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెంలో రాస మల్ల రాజయ్య–కమలమ్మ స్మారకార్థం నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. యువత మత్తుకు చిత్తు కావద్దని పేర్కొన్నారు.