హైదరాబాద్: 28°C
తెలంగాణ

హోటళ్లలో తనిఖీలు చేసిన అధికారులు

SRPT: జాతీయ రహదారి- 65 వెంబడి హోటళ్లు, ధాబాల్లో టీజీ సేఫ్ అధికారులు బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. అక్టోబర్ 13న ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేపట్టిన తనిఖీల్లో వంటగదుల్లో బొద్దింకలు, ఫంగస్ పట్టిన కూరగాయలు, అపరిశుభ్రతను గుర్తించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి పర్యవేక్షణలో 10 ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.