హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యానాం వాసులకు గుడ్ న్యూస్

కోనసీమ: యానాంలోని రేషన్ కార్డుదారులందరికీ పండుగ కానుకగా 5 రకాల నిత్యావసర సరకులను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు 2 కిలోల చక్కెర, 2 కిలోల సన్ఫ్లవర్ ఆయిల్, కిలో శనగపప్పుతో పాటు చెరో 500 గ్రాముల మైదా పిండి, రవ్వ ఉచితంగా అందనున్నాయి. అంతేకాకుండా ప్రతి నెలా ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రతిపాదించారు.