SKLM: కాశీబుగ్గ సర్కిల్ ఇన్ స్పెక్టర్గా ఎం.అప్పారావు బుధవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు మెరైన్ విభాగంలో విధులు నిర్వహించిన ఆయన బదిలీపై కాశీబుగ్గకు వచ్చారు. గత రెండు నెలలుగా కాశీబుగ్గ సీఐ పోస్టు ఖాళీగా ఉండటంతో తాజాగా ఆయన నియామకంతో ఆ పోస్టు భర్తీ అయింది. ఎన్నికల వేళ సీఐ నియామకం జరగడంతో పోలీసు శాఖలో కీలకమైన పోస్టు భర్తీ అయింది.
ఆంధ్రప్రదేశ్
కాశీబుగ్గ కొత్త సీఐగా అప్పారావు


