హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫ్లైఓవర్‌పై కారులో మంటలు

WGL: అన్నోజిగూడ ఫ్లైఓవర్‌పై బుధవారం ఓ పెట్రోల్ కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరికి చెందిన కుటుంబం హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేయించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇంజిన్‌ నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.