హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

MLG: ములుగు మండలం జాకారం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాణాలపల్లికి చెందిన యాట సాంబలక్ష్మి (50) మృతి చెందింది. కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ములుగుకు వస్తుండగా, అబ్బాపూర్ క్రాస్‌రోడ్డు వైపు నుంచి వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాంబలక్ష్మికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.