హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాసం షాపింగ్ మాల్‌లో చోరీ.. దంపతులు అరెస్టు

BHPL: చిన్నారి మెడలోని బంగారు లాకెట్ చోరీ చేసిన కేసులో మల్హర్ మండలం నాచారానికి చెందిన మంజు కవిత, ఆమె భర్త శ్రీధర్‌ను అరెస్టు చేసినట్లు CI శ్రీనివాస్ బుధవారం తెలిపారు. ఈ నెల 11న భూపాలపల్లిలోని ఓ వస్త్ర దుకాణానికి షాపింగ్‌కు వచ్చిన చిన్నారి లాకెట్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు వెల్లడించారు.