హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్

KNR: సైదాపూర్ మండలం వెన్నంపల్లిలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పరారైనట్లు ఏసీపీ సతీష్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.3,100 నగదు, మూడు బైకులు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు నిమిత్తం సైదాపూర్ పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు.