హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుక అక్రమ రవాణా.. 2 ట్రాక్టర్ల సీజ్

JGL: మల్లాపూర్ గోదావరి పరివాహక ప్రాంతం నుంచి ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని గ్రామాలకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎస్సై నవీన్ సీజ్ చేశారు. యమాపూర్ జీపీఓ శ్రీనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగిలిపేట గ్రామానికి చెందిన చిన్న సాయిలు, రేపాని మోహన్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.