అన్నమయ్య: రాజంపేట రెడ్డివారి వీధిలోని శ్రీ వీర చౌడేశ్వరి అమ్మవారికి శ్రీశైల దేవస్థానం తరఫున బుధవారం పట్టువస్త్రాలు, సారె, లడ్డూ ప్రసాదాలను సమర్పించారు. దేవస్థానం ఛైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు ఆదేశాల మేరకు పట్టుపోగుల ఆదినారాయణ ఆధ్వర్యంలో దివ్యజ్ఞానానంద గిరి స్వాముల వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
వీర చౌడేశ్వరి అమ్మవారికి పట్టువస్త్రాలు


