హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ ఆడటానికి వెళ్తూ మహిళ హఠాన్మరణం

WGL: బతుకమ్మ ఆడేందుకు వెళ్తున్న ఈర కొమురమ్మ (65) బుధవారం గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది. కరీమాబాద్‌కు చెందిన ఆమె బతుకమ్మతో విద్యుత్ సబ్‌స్టేషన్‌ ముందు నుంచి బీరన్న దేవాలయానికి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా పడిపోయింది. స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.