హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుక ట్రాలీ కిందపడి డ్రైవర్ మృతి

SRCL: సిరిసిల్ల పట్టణంలోని గణేష్ నగర్‌లో ఓ ఇంటి నిర్మాణం వద్ద ఇసుకను ఖాళీ చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ కింద పడి డ్రైవర్ తిరుపతి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో స్థానికులు దిగ్భ్రాంతికి గురవ్వగా, మృతుని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.