హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల భద్రతపై ఎస్పీ సమీక్ష

అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాల పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సమీక్ష నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, పాత నేరస్తులు, రౌడీషీటర్లపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ఓటర్లను ప్రలోభపెట్టే నగదు, అక్రమ మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు.