హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జిల్లాలో అక్రమ దందాలపై ప్రత్యేక దృష్టి సారించాం'

మంచిర్యాల జిల్లాలో అక్రమ దందాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీసీపీ ఏగ్గడి భాస్కర్ ప్రకటనలో తెలిపారు. స్పెషల్ పార్టీ, మొబైల్ పార్టీ, సీసీఎస్ టీమ్ ల తోపాటు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయన్నారు. చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై 112 డయల్, నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పోలీస్ వారికి సహకరించాలని డీసీపీ కోరారు.