ADB: ఆదిలాబాదు కలెక్టరేట్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను జిల్లా కలెక్టర్ రాజర్షిషా బుధవారం ఘనంగా ప్రారంభించారు. పూలను దైవంగా భావించి పూజించే అద్భుతమైన సాంస్కృతిక సంప్రదాయం తెలంగాణ ప్రజలది అని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. అనంతరం మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ పాటలకు చప్పట్లు కొడుతూ సంబురాల్లో పాల్గొన్నారు.
తెలంగాణ
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్


