హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకట్టుకున్న కళారూపాల ప్రదర్శనలు

TPT: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి నిర్వహించిన ముత్యపుపందిరి వాహనసేవలో తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 16 కళాబృందాల 415 మంది కళాకారులు అలరించారు. కేరళం మయూర నృత్యం, ఒడిశా సంబల్పురి, మణిపురి, అస్సాం బిహు, తెలంగాణ దేవీ వైభవం తదితర కళారూపాలు ఆకట్టుకున్నాయి.