హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

సిద్దిపేట పట్టణంలో మరమ్మత్తు పనుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది. టీటీడీ 11కేవీ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏడీఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఖాదర్‌పుర, నసీర్ నగర్, కప్పలకుంట, నాసర్‌పుర, సల్మాన్‌పుర, గ్రీన్ కాలనీ, మెదక్ రోడ్ ఫాతిమా పెట్రోల్ పంప్ ఏరియా ప్రజలు సహకరించాలని కోరారు.