హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగం అమానుషం

KNR: గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ వ్యవహారశైలిపై కథనాలు రాసిన జర్నలిస్టులు సంపత్, శేఖర్‌పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి నిర్బంధించి దాడి చేయడం అమానుషమన్నారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు