E.G: జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్, మాజీ మంత్రి తోట నరసింహం బుధవారం గోకవరం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జ్యోతుల నెహ్రూ తనకు కొత్త కాదని, 2004, 2009 ఎన్నికల్లో ఓడించానని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఓటమి పాలైందని, రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఎన్నికల్లో కూటమిని ఓడించడమే లక్ష్యం'


