కృష్ణా జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పూర్తి సిద్ధంగా ఉన్నామని డీపీవో ధనలక్ష్మి తెలిపారు. జిల్లాలోని 26 మండలాల్లో ఉన్న 491 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. తొలి విడతలో గుడివాడ, రెండో విడతలో ఉయ్యూరు, మూడో విడతలో మచిలీపట్నం డివిజన్లలో ఎన్నికలు జరుగుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: డీపీవో


