JGL: జగిత్యాల పట్టణంలోని కోదండ రామాలయం వద్ద సువర్ణ దుర్గ సేవా సమితి ఏర్పాటు చేసిన దుర్గాదేవి బుధవారం పుష్పాలంకరణలో అలరించింది. వివిధ రకాల పూలతో అమ్మవారిని అందంగా అలంకరించగా భక్తులు తిలకించి పులకించారు. ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి పాటలు, కోలాహలంతో ఆలయ పరిసరాలు భక్తిమయంగా మారాయి.
తెలంగాణ
పుష్పలంకరణతో అలరించిన దుర్గాదేవి అమ్మవారు


