హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సమస్యల వలయంలో ఆర్టీసీ బస్టాండ్'

MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు వడిపల్లి అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బస్టాండ్‌లో మరుగుదొడ్లు, ఫ్యాన్లు, లైట్లు, బస్టాండ్‌కు సక్రమంగా పేరు, బోర్డు కూడా లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని విమర్శించారు.