హైదరాబాద్: 28°C
తెలంగాణ

కామారెడ్డిలో రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలు

కామారెడ్డి: రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ముమ్మరం చేయాలని రెడ్‌క్రాస్ ఛైర్మన్ సంజీవరెడ్డి చెప్పారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలో నూతన రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 16వ తేదీన రెడ్ క్రాస్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఉంటుందని, ఈ కార్యక్రమానికి కలెక్టర్, జిల్లా SP హాజరవుతారని వివరించారు.