హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో దసరా సెలవుల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు..!

ఖమ్మం జిల్లాలో విద్యార్థులు, ప్రజల కోసం దసరా సెలవుల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు డీఈవో వాసంతి బుధవారం తెలిపారు. ఈ క్యాంపుల్లో కొత్త నమోదుతో పాటు బయోమెట్రిక్ అప్‌డేట్‌లు చేస్తారని, నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని, అదనపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.