హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజంపేటలో రాజకీయ బ్యానర్లపై నిషేధం

అన్నమయ్య: రాజంపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 14 నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) అమల్లోకి వచ్చింది. మున్సిపాలిటీ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా రాజకీయ బ్యానర్లు, పోస్టర్లు, స్టిక్కర్లు ఏర్పాటు చేయడం నిషేధమని అధికారులు తెలిపారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ,ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజలు,రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.