ASF: వాంకిడి మండలంలో రాత్రి వేళ వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. రాత్రి సమయాల్లో కుక్కలు రోడ్లపై సంచరిస్తూ ప్రజలను భయపెడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
రాత్రి వేళ గుంపులు గుంపులుగా వీధి కుక్కల సంచారం


