హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫాదర్ ఫెర్రర్ విగ్రహాల ఏర్పాటుకు భూమిపూజ

ATP: కంబదూరు మండలం గుద్దిళ్లలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ విగ్రహాల ఏర్పాటుకు MLA అమిలినేని సురేంద్రబాబు భూమిపూజ చేశారు. అదే గ్రామంలో రూ.6 లక్షలతో వేముల గంగన్న కుటుంబసభ్యులు నిర్మించిన పాఠశాల మౌలిక వసతుల భవనాన్ని ప్రారంభించారు. పిడుగుపాటుకు మృతిచెందిన రైతు ఎద్దుల యజమానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.