GDWL: వడ్డేపల్లి మున్సిపాలిటీలోని శాంతినగర్లో బుధవారం పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఇందిరానగర్ కాలనీకి చెందిన భాగ్యమ్మ, మాధవరావు దంపతులు ఫంక్షన్కు వెళ్లిన సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో ఉన్న 30.7 తులాల బంగారం, 1.5 కేజీల వెండి, రూ.14 వేల నగదును అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
శాంతినగర్లో పట్టపగలే భారీ చోరీ


