హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెన్నచర్లలో అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం

NGKL: పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవతో రూ.4 లక్షలకు పైగా నిధులతో ఈ పనులు మంజూరయ్యాయి. మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్ పనులను ప్రారంభించారు. గ్రామంలో మురుగునీటి సమస్య పరిష్కారానికి ఈ నిర్మాణం దోహదపడుతుందని తెలిపారు.