హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి పురాతన వస్తువులు ప్రదర్శన

విశాఖ దసపల్లా హిల్స్ రోడ్లోని సివిక్ ఎక్స్ నోరాలో ఈనెల 15 నుంచి 18 వరకు పురాతన వస్తువులు, నాణేలు, నోట్ల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయుడు గంగాధరరావు తెలిపారు. ఏయూలో బీటెక్ చదువుతూ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న గీత అనే విద్యార్థిని సహాయార్థం ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు.