హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు బ్యాటరీ స్ప్రేయర్లు పంపిణీ

ASR: వాటర్‌షెడ్ ఆధ్వర్యంలో కొయ్యూరు మండలంలో రైతులకు రాయితీపై బ్యాటరీ స్ప్రేయర్లు పంపిణీ చేశారు. MPDO కార్యాలయంలో బుధవారం వాటర్‌షెడ్ అదనపు పీడీ రాజ్‌కుమార్ సమక్షంలో 191 మంది రైతులకు ఈ పరికరాలు అందించారు. ఒక్కో స్ప్రేయర్ విలువ రూ.3,250 కాగా, రైతులకు కేవలం రూ.320కే అందజేశారు. మొత్తం 1,056 మంది రైతులను ఎంపిక చేయగా, తొలివిడతలో 191 మందికి పంపిణీ చేశారు.