హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోర్టు కేసులతో తాడిగడప, గుడివాడ ఎన్నికలకు బ్రేక్‌!

కృష్ణా: మున్సిపల్ ఎన్నికల వేళ కృష్ణా జిల్లాలోని తాడిగడప, గుడివాడ మున్సిపాలిటీలకు ఎన్నికల సంఘం ప్రకటించిన తొలి విడత ఎన్నికల షెడ్యూల్‌లో చోటు దక్కలేదు. కోర్టు వివాదాల కారణంగా ఈ రెండు మున్సిపాలిటీలతో పాటు మరో 18 మున్సిపాలిటీలు, నాలుగు కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్‌ జారీ కాలేదు. న్యాయ వివాదాలు పరిష్కారమైన తర్వాత తదుపరి విడతలో షెడ్యూల్‌ ప్రకటించనున్నారు.