హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాళం వేసిన రెండు ఇళ్లలో చోరీ

NZB: ఆలూరు మండలం డీకంపల్లిలో బుధవారం రెండు ఇళ్లలో చోరీ జరిగింది. బాబు కుటుంబంతో నిజామాబాద్‌కు వెళ్లడాన్ని గమనించిన దొంగలు ఇంట్లో చొరబడి 12 గ్రాముల బంగారం, 10 తులాల వెండి, రూ.50 వేల నగదు అపహరించారు. అనంతరం సాయికుమార్‌ ఇంట్లో రెండు బీరువాలను ధ్వంసం చేసి రెండు తులాల బంగారం, తులం వెండి, రూ. 1 లక్ష నగదు ఎత్తుకెళ్లారు.