హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎన్నికలపై రాజకీయ పార్టీలతో సమావేశం

ప్రకాశం: కనిగిరి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనట్లు కమిషనర్, అసిస్టెంట్ ఎన్నికల అధికారి శ్రీధర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పిస్తామని అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు హాజరు కావాలన్నారు.