హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ కార్మికుల సమస్యలపై హామీ..!

NZB: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ,ఏఐటీయూసీ నాయకులు కమిషనర్ దిలీప్ కుమార్కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ప్రతినెలా 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని, కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో దుస్తులు, చెప్పులు, సబ్బులు, నూనెలు అందజేస్తామని, మెకానిక్ షెడ్డు ఏర్పాటు చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.