హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హెచ్‌ఐవీ నివారణకు సమన్వయంతో పనిచేయాలి'

KMR: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నివారణకు శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ సంచాలకుడు డా. రాకేశ్‌ గుప్తా సూచించారు. ప్రతి గర్భిణికి హెచ్‌ఐవీ, సిఫిలిస్‌, హెపటైటిస్‌-బి పరీక్షలు నిర్వహించాలని, వ్యాధిపై అపోహలు, వివక్ష తొలగించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. బుధవారం వీడియో సమావేశంలో కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ పాల్గొన్నారు.