జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కొనసాగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2027 నుంచి 2031 వరకు ఐదేళ్ల పాటు కార్యక్రమం జరగనుంది. దీని ద్వారా 3.20 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. అలాగే దివ్యాంగుల పింఛన్ల అర్హతను 80 నుంచి 40 శాతానికి తగ్గించేందుకు, వీరి వయోపరిమితి తొలగింపునకు ఆమోద ముద్ర వేసింది. ఇకపై దివ్యాంగులకు పుట్టుక నుంచే పింఛన్ సదుపాయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వార్తలు
ఇకపై పుట్టుక నుంచే దివ్యాంగ పింఛన్


