హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌కు తగ్గిన రష్యా చమురు దిగుమతులు

రష్యా నుంచి దిగుమతి అయ్యే క్రూడ్ ఆయిల్ దిగుమతుల్లో గత నెలలో భారీగా క్షీణత నమోదైంది. సెప్టెంబర్ నెలలో రోజుకు 1.82 మిలియన్ బ్యారెళ్ల చమురు మాత్రమే దిగుమతి అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దిగుమతులు తగ్గడానికి చైనా నుంచి పెరుగుతున్న తీవ్ర పోటీతో పాటు చమురు కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు చేయడం కూడా కారణమని నిపుణులు తెలిపారు.