హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులకు రూ.15 లక్షల టోకరా?

KNR: తిమ్మాపూర్‌ మండలం పోరండ్లకు చెందిన తిరుపతి, తిమ్మాపూర్‌లో బ్రాంచి పోస్ట్‌మాస్టర్‌గా పనిచేశాడు. ఖాతాదారుల నుంచి సుమారు రూ.15 లక్షలు మోసం చేసి పరారయ్యాడని గ్రామస్థులు ఆరోపించారు. నగదు జమ చేసిన పలువురి డబ్బులను వివిధ మార్గాల్లో కాజేసినట్లు బాధితులు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.