హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యలు పరిష్కరించాలి: MLA కవ్వంపల్లి

KNR: మానకొండూర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో MLA కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యంపై సమీక్షించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. పెండింగ్‌ పనులను వేగంగా పూర్తి చేసి ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలన్నారు.