హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీజేపీ జెండా తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి'

JN: జాఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో బీజేపీ జెండాను తొలగించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే జెండాను తొలగించారని ఆరోపించారు. నిందితులను గుర్తించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో BJP నాయకులు తదితరులు ఉన్నారు.