హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి గ్రామంలో రోజుకు 60 మందికి ఉపాధి'

KMR: ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు సగటున 60 మంది కూలీలకు ఉపాధి కల్పించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను బుధవారం ఆదేశించారు. ఉపాధి పనుల అమలులో నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 90 రోజుల వేతన ఉపాధి కల్పించాలన్నారు. రెండో విడత ఇళ్లకు కొత్త అంచనాలను త్వరగా రూపొందించాలని తెలిపారు.