BHPL: చిట్యాల మండలం నవాబుపేటలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు నేరెళ్ల రమేష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అణగారిన వర్గాలకు హక్కులు కల్పించారని తెలిపారు. ఆయన ఆశయాలను గ్రామగ్రామాన విస్తరించేందుకు విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ


