హైదరాబాద్: 28°C
వార్తలు

ఆలయ సన్నిధిలో చిన్నారితో అసభ్య ప్రవర్తన

మహారాష్ట్ర పుణెలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. నిగ్డి ప్రాంతంలోని గుడికి వెళ్లిన ఆ బాలిక దేవుడిని దర్శించుకున్న తర్వాత బొట్టు పెట్టుకోవడానికి అద్దం వద్దకు వెళ్లింది. ఆ సమయంలో బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నిందితుడు ఆమె వద్దకు వెళ్లి అభ్యంతకరంగా తాకడానికి యత్నించాడు. భయంతో బాలిక కేకలు వేయడంతో అతను పరారయ్యాడు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.