హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు మెరుగుపరచాలి'

BHPL: ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో రోగులకు మెరుగైన సేవలందించేందుకు అవసరమైన మౌలిక వసతులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం కలెక్టర్, వైద్య అధికారులతో కలిసి ఆసుపత్రిని పరిశీలించారు. ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ యంత్రాలకు విద్యుత్ సదుపాయాలు, అత్యవసర విభాగం, తాగునీరు, పార్కింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.