తూ.గో: రాజమండ్రి నగరంలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నల్లా ఛానల్ వద్ద రూ.2 కోట్లతో నిర్మించనున్న అదనపు వెంట్కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణంతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వేగంగా బయటకు వెళ్లనుంది. గోదావరి జలాల పరిరక్షణకు మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాతే నదిలోకి మళ్లించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ముంపు సమస్యకు చెక్.. రూ.2 కోట్లతో అదనపు వెంట్: ఆదిరెడ్డి


