హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహా చండీ దేవిగా దర్శనమిచ్చిన తలుపులమ్మ దేవి

కాకినాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవలోని అమ్మవారు శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజు మహా చండీ దేవిగా దర్శనమిచ్చారు. అర్చకులు విశేష పూజలు నిర్వహించగా పండితులు చండీ హోమం జరిపారు. అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి దర్శనం చేసుకున్నారు.