హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఎర్రచందన స్మగ్లర్‌లు అరెస్ట్

KDP: కడప జిల్లాలో కాఫీ పొడి ప్యాకెట్‌ల మాటున ఎర్రచందనం తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 1.984 టన్నుల బరువున్న 70 ఎర్రచందనం దుంగలు, మూడు వాహనాలు, 643 కాఫీ పౌడర్ అట్టపెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ. 1.30 కోట్ల విలువైన సొత్తును సీజ్ చేశారు. ఎస్‌.ఏ. కాశినాయన మండలం ఆకుల నారాయణపల్లె సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.