హైదరాబాద్: 28°C
వార్తలు

స్థానిక ఎన్నికల్లో కూటమిదే విజయం: మంత్రి

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని మంత్రి కొల్లు రవీంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఎంత అస్తవ్యస్తమైందో ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొందని అన్నారు. వైసీపీకి కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు.